లండన్ లో కోహ్లీకి గాయాలు... టీమిండియాకు షాక్!

  • 5న వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్
  • ప్రాక్టీస్ సెషన్ లో గాయం
  • హోటల్ గదికే పరిమితమైన కోహ్లీ
మరో మూడు రోజుల్లో వరల్డ్ కప్ క్రికెట్ పోరులో తన అవకాశాలను వెతుక్కోవాల్సిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయాల పాలయ్యాడు. 5వ తేదీన దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడాల్సిన తరుణంలో, ప్రాక్టీస్ కు వెళ్లిన వేళ, కోహ్లీకి గాయమైంది. దీంతో అతను ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగి, హోటల్ గదికే పరిమితమయ్యాడు.

ప్రస్తుతం అతని గాయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారని, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ ఆడతాడా? లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జట్టు మేనేజ్ మెంట్ వ్యాఖ్యానించింది. కాగా, కోహ్లీ చేతి వేలికి స్వల్ప గాయమైనట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Go Back to Shorts
India
Cricket
Virat Kohli

More Telugu News