తిరుమలలో భారీ రద్దీ... రోడ్డుపైనే వేచిచూస్తున్న భక్తులు!
- నిండిపోయిన కంపార్టుమెంట్లు
- సర్వదర్శనానికి 24 గంటల సమయం
- రేపు తిరుమల రానున్న వెంకయ్యనాయుడు
వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతోనే రద్దీ అధికంగా ఉందని వెల్లడించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రేపు ఉదయం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తిరుమలకు రానున్నారు. రేపు ఉదయం తిరుపతిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన, ఆపై, తిరుమల చేరుకొని, పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేయనున్నారు.
మంగళవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారని, ఆ రోజంతా తిరుమలలోనే గడపనున్న వెంకయ్యనాయుడు, బుధవారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.