గవర్నర్ సమక్షంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
- విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు జగన్
- ఉమ్మడి అంశాలపై భేటీలో చర్చించే అవకాశం
- ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎంలు
ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన, కార్యాలయాల అప్పగింత తదితర సమస్యలపై చర్చించనున్నారు. సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం రంజాన్ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎంలిద్దరూ పాల్గొననున్నారు.