మోదీ కేబినెట్ లోకి అమిత్ షా
మరో రెండు గంటల్లో దేశ ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనంతరం కొత్త కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. కేంద్ర మంత్రుల జాబితా ఇప్పటికే బయటకు వచ్చింది. మరోవైపు, తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన అమిత్ షాకు కూడా తన కేబినెట్ లో మోదీ అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీతో పాటు అమిత్ షా కూడా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాను కొనసాగిస్తూనే... ఆయనను కేబినెట్ లోకి కూడా తీసుకోవాలని మోదీ నిర్ణయించినట్టు సమాచారం.