ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లలేకపోయిన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్!
- మధ్యాహ్నం 3.30లోపు రావాలని సమాచారం
- విజయవాడలోనే ఆలస్యం
- పర్యటనను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రులు
అయితే మోదీ ప్రమాణస్వీకారానికి దేశవిదేశాల నుంచి అతిథులు వస్తున్నారనీ, కాబట్టి ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయిందని పౌరవిమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకే ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే విజయవాడలోనే సమయం 3 గంటలు అయిపోవడంతో జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనను రద్దుచేసుకున్నట్లు సమాచారం.