Andhra Pradesh: జగన్ సీఎం కావడం గర్వంగా ఉంది!: కేవీపీ రామచంద్రరావు

  • వైఎస్ కు మంచిపేరు తీసుకొస్తారని ఆశిస్తున్నా
  • ఓ కుటుంబ సభ్యుడిగా అభినందించడానికి వచ్చా
  • మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
ఏపీ ముఖ్యమంత్రిగా తన స్నేహితుడి కుమారుడు జగన్ ప్రమాణస్వీకారం చేయనుండటం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల అభీష్టానికి అనుగుణంగా భారీ విజయంతో వైసీపీని జగన్ గెలుపుతీరాలకు చేర్చారని వ్యాఖ్యానించారు.

వైఎస్ అడుగుజాడల్లో నడుస్తూ జగన్ తండ్రికి మంచిపేరు తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద కేవీపీ మీడియాతో మాట్లాడారు. జగన్ ఓ సమర్థవంతుడైన పాలకుడిగా పేరు తెచ్చుకుంటాడని నమ్ముతున్నానని చెప్పారు. ఓ కుటుంబ సభ్యుడిగా జగన్ ను అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చామని తెలిపారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
kvp
Congress

More Telugu News