kishan reddy: కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి... మోదీ కార్యాలయం నుంచి ఫోన్

  • కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి స్థానం
  • సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ
  • హాజరవుతున్న 8వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు
అందరూ ఊహించిందే జరిగింది. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్న ఎంపీలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్న సంగతి తెలిసిందే. మరి కొందరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా ఫోన్ చేసి, విషయాన్ని తెలుపుతున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న మోదీ ప్రమాణస్వీకారానికి 8వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు.
kishan reddy
cabinet
bjp
modi

More Telugu News