Jagan: జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ... ఏమన్నారంటే..!

  • తొలిసారిగా ఓ ప్రమాణ స్వీకారానికి వచ్చా
  • గత పాలనలో అసంతృప్తితో ఉన్న ప్రజలు
  • ప్రజలకు సుపరిపాలన దగ్గర కానుందన్న వర్మ
తన జీవితంలో తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చానని, ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి వచ్చిన ఆయన, తనను పలకరించిన మీడియాతో మాట్లాడారు.

గత పాలనలో ఎంతో అసంతృప్తితో ఉన్న ప్రజలు, జగన్ తమకు ఎంతో చేస్తారని నమ్మి ఓట్లు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పోరాటాన్ని చూస్తే, రాష్ట్ర భవిష్యత్ పై తనకే ఎంతో హోప్ వచ్చిందని అన్నారు. జగన్ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వలేదని, నిజాయితీగా తాను చేయబోయేది చెప్పారని, ప్రజలు దాన్ని నమ్మారని అన్నారు. జగన్ పరిపాలనలో నాటకీయత ఉంటుందని తాను అనుకోవడం లేదని, సుపరిపాలన ప్రజలకు అందుతుందని భావిస్తున్నానని వర్మ వ్యాఖ్యానించారు.
Jagan
Varma
Oath
Vijayawada

More Telugu News