veerabhadram choudari: ఈవీవీ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాను .. 'అల్లరి' నరేశ్ కి హిట్ ఇచ్చాను: దర్శకుడు వీరభద్రం చౌదరి

  • ఈవీవీ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాను
  •  తేజ గారి దగ్గర కో డైరెక్టర్ గా చేశాను
  •  'అహ నా పెళ్లంట' హిట్ అయింది
దర్శకుడు వీరభద్రం చౌదరి పేరు వినగానే 'పూలరంగడు' .. 'అహనా పెళ్లంట' వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఆయనకి, ఆ తరువాత సక్సెస్ లు పడలేదు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నిడదవోలులో డిగ్రీ పూర్తయిన వెంటనే, సినిమాలపట్ల ఉత్సాహంతో ఇక్కడికి వచ్చేశాను. ఈవీవీ సత్యనారాయణ గారి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను.

ఆ తరువాత తేజ గారి దగ్గర కో డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సమయంలో చాలా అవకాశాలు వచ్చాయిగానీ, సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తూ వచ్చాను. మంచి అవకాశం అనిపించడంతో, 'అల్లరి' నరేశ్ తో 'అహ నా పెళ్లంట'తో దర్శకుడిగా మారాను. నరేశ్ కెరియర్లో 100 రోజులు ఆడిన తొలిసినిమా ఇది" అని ఆయన చెప్పుకొచ్చారు. 
veerabhadram choudari

More Telugu News