Andhra Pradesh: వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది!: వైసీపీ నేత పీవీపీ

  • జగన్ నాయకత్వంలో ఉజ్వలమైన ఏపీ
  • అందుకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) తెలిపారు. జగన్ నాయకత్వంలో ఉజ్వలమైన ఏపీ భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. జగన్ తో కలిసి విజయవాడలో నిన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న పీవీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను జగన్ తో కలిసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. విజయవాడ లోక్ సభ సీటుకు వైసీపీ తరఫున పోటీచేసిన పీవీపీ టీడీపీ నేత కేశినేని నాని చేతిలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
pvp
Jagan

More Telugu News