జగన్ కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ.. థ్యాంక్స్ చెప్పిన వైసీపీ అధినేత!
- శుభాకాంక్షలు తెలిపిన బెంగాల్ సీఎం
- నేడు ప్రమాణస్వీకారం చేయనున్న జగన్
- సుందరంగా ముస్తాబయిన ఇందిరాగాంధీ స్టేడియం
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. దీంతో జగన్ ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు జగన్ బంధువు హీరో మంచు విష్ణు ఈరోజు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.