cudupha: కడపలోని పెద్ద దర్గాలో చాదర్‌ సమర్పించిన వైసీపీ అధినేత జగన్‌

  • తిరుమల నుంచి నేరుగా కడప చేరుకున్న జగన్‌
  • దర్గాను సందర్శించగా సంప్రదాయ తలపాగా చుట్టిన మతపెద్దలు
  • అనంతరం పులివెందులకు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనతో బిజీగా ఉన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రత్యేక పూల చాదర్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి సంప్రదాయ తలపాగా చుట్టారు. అనంతరం జగన్‌ పులివెందుల బయలుదేరి వెళ్లారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ఇడుపులపాయలోని తండ్రి సమాధిని సందర్శిస్తారు. సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.
cudupha
peda darga
jagan

More Telugu News