hindu mahasabha: విద్యార్థులకు కత్తులను బహూకరించిన హిందూమహాసభ

  • సావర్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన హిందూమహాసభ
  • 10 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కత్తుల బహూకరణ
  • ఆయుధాల వినియోగం గురించి హిందువులు తెలుసుకోవాలన్న అశోక్ పాండే
హిందూమహాసభ నేత వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి కార్యక్రమాన్ని లక్నోలో ఆ సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 10 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కత్తులను బహూకరించింది.

అనంతరం హిందూమహాసభ అధికార ప్రతినిధి అశోక్ పాండే మీడియాతో మాట్లాడుతూ, తమను తాము రక్షించుకోవడమే కాకుండా, దేశాన్ని రక్షించేందుకు ఆయుధాల వినియోగం గురించి హిందువులు తెలుసుకోవాలని తెలిపారు. హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజ శకున్ పాండే మాట్లాడుతూ, హిందువుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మైనర్లకు కత్తులతో పాటు, భగవద్గీతను కూడా అందించామని తెలిపారు.
hindu mahasabha
knives
students

More Telugu News