ఈవీఎంల కారణంగానే ఓటమి... తొలిసారి స్పందించిన పరిటాల శ్రీరామ్!
- ఈవీఎంల కారణంగానే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది
- ప్రజల గుండెల్లో మా స్థానం మారలేదు
- ప్రజల దృష్టిలో ఎమ్మెల్యేలు, మంత్రులం తామేనన్న శ్రీరామ్
నియోజకవర్గంలోని గ్రామాలకు నీటి కొరత లేకుండా చూసేందుకు రూ. 200 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఏ గ్రామాన్నీ పక్షపాతంతో చూడలేదని, పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు. వైసీపీ గెలవగానే గొడవలకు దిగుతున్నారని, ఇది సరికాదని పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. తమ కుటుంబానికి అభిమానులు, ప్రజలు అండగా ఉన్నంతవరకూ ఎమ్మెల్యేలు, మంత్రులం తామేనని, అందరమూ ఓ కుటుంబంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఇక్కడే పుట్టిన తాము, ఇక్కడే బతుకుతామని, గ్రామాలను వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు.