సాయిధరమ్ తేజ్ స్క్రిప్ట్ ను ఓకే చేసిన చిరూ
- మారుతి దర్శకత్వంలో తేజు
- కొత్త కథకి గ్రీన్ సిగ్నల్
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన 'చిత్రలహరి' ఫరవాలేదనిపించింది. దాంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో సాయిధరమ్ తేజ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. 'చిత్రలహరి'కి ముందు ఆయన వరుసగా అరడజను పరాజయాలను ఎదుర్కున్నాడు. సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనే తేజును వరుస పరాజయాలు వెంటాడుతున్నాయనే టాక్ వచ్చింది.
దాంతో తన దగ్గరికి వచ్చిన కథలను పరిశీలించి ఓకే చేసే బాధ్యతను ఆయన చిరంజీవి - అల్లు అరవింద్ లపై పెట్టారు. తాజాగా తేజు కోసం మారుతి ఒక కథను సిద్ధం చేసి, చిరంజీవి - అల్లు అరవింద్ లకు వినిపించాడట. కథ నచ్చడంతో ఈ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకున్నారనీ, త్వరలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియ పూర్తికానుందని చెబుతున్నారు.