శ్రీలంక నుంచి లక్ష్యద్వీప్ కు 15 మంది ఉగ్రవాదులు పయనం... కేరళ తీరంలో హైఅలర్ట్
- నిఘా వర్గాల హెచ్చరికలు
- కేరళలో అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో అప్రమత్తత
- తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం
లక్ష్యద్వీప్ లో అడుగుపెట్టడం ద్వారా, అక్కడ్నించి ఇతర మార్గాల్లో భారత ప్రధానభూభాగంలోకి ప్రవేశించాలన్నది ఉగ్రవాదుల ప్లాన్ అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ తీరం వెంబడి భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే పడవలను తనిఖీ చేయాలని, సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.