హైదరాబాద్‌లో దారుణం.. భార్య, కొడుకును హత్య చేసి పరారైన భర్త
- 10 రోజుల క్రితం హైదరాబాద్‌కు వలస
- తోడల్లుడు కుటుంబంతో కలిసి ఒకే ఇంట్లో నివాసం
- దీపక్ దంపతులు డ్యూటీకి వెళ్లిన అనంతరం హత్య
- కేసు విచారిస్తున్న పోలీసులు
ఆదివారం ఉదయం 9 గంటలకు దీపక్ దంపతులు డ్యూటీకి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండటంతో దీపక్ పలు మార్లు రాజేశ్‌కు ఫోన్ చేశాడు. ఎంతకీ రాజేశ్ ఫోన్ ఎత్తకపోవడంతో దీపక్, ఇంటి తాళం పగులగొట్టి చూడగా ఊర్మిళ, ఆమె కొడుకు కిసాన్(7) రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఊర్మిళను ఇనుపరాడ్డుతో మోది చంపినట్టు గుర్తించారు. కిసాన్ మృత దేహాన్ని బాత్రూంలో గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.