pm: గుజరాత్ ప్రజల దీవెనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా: మోదీ

  • అహ్మదాబాద్ లో బీజేపీ విజయోత్సవ సభ
  • 300కు పైగా సీట్లు సాధిస్తామని ముందే చెప్పా
  • బీజేపీకి ప్రజలు కసితో ఓట్లు వేశారు
గుజరాత్ ప్రజల దీవెనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, 2014లో గుజరాత్ ను విడిచి ఢిల్లీ వెళ్లినప్పుడు చాలా బాధపడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై మాట్లాడటం మూడొందలకు పైగా సీట్లు సాధిస్తామని తాను ముందే చెప్పానని అన్నారు. బీజేపీకి ప్రజలు కసితో ఓట్లు వేశారన్న విషయం ఆరో దశ పోలింగ్ సరళి తర్వాత తనకు అర్థమైందని అన్నారు. బీజేపీ మూడు వందలకు పైగా స్థానాల్లో గెలుపొందబోతున్నామంటే చాలా మంది నవ్వారని అన్నారు. అంతకుముందు, సూరత్ ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు మోదీ నివాళులర్పించారు.
pm
modi
gunarat
ahammadabad
BJP

More Telugu News