India: దేశవ్యాప్తంగా ముగిసిన ఎన్నికల కోడ్

  • ప్రకటన చేసిన ఈసీ
  • ఎన్నికల ఫలితాలతో ముగిసిన క్రతువు
  • లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల క్రతువు అధికారికంగా ముగిసింది. మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగాయి. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, మార్చి 18న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మూడు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అమలు చేశారు. తాజాగా ఈసీ ప్రకటనతో కోడ్ ముగిసింది.
India

More Telugu News