YSRCP: జగన్ ను దూషించాడంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై కేసు నమోదు

  • విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ ఫిర్యాదు
  • వీడియో ఆధారాలు పోలీసులకు సమర్పించిన వైసీపీ అభ్యర్థి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వెలగపూడి వీడియో
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అతి కొద్దిమంది టీడీపీ ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు ఒకరు. ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. అయితే, గెలిచిన ఆనందంలో జగన్ పైనా, మోదీపైనా భారీస్థాయిలో అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్టు ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి విజయనిర్మల ఎమ్మెల్యే వెలగపూడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెలగపూడి ప్రసంగాల వీడియోను కూడా పోలీసులకు అందించారు.

ఈ వీడియో పరిశీలించిన పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అంతకుముందు, వెలగపూడి రామకృష్ణపై అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. సీఎం కాబోతున్న వ్యక్తిపై అసభ్యపదజాలం ఉపయోగించడం వెలగపూడి సంస్కారం ఏస్థాయిలో ఉందో చెబుతోందని విమర్శించారు.

YSRCP
Telugudesam
Vizag

More Telugu News