amaravathi: రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది.. శ్వేతపత్రాలు విడుదల చేస్తా: వైఎస్ జగన్

  • ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు
  • బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు
  • ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షిస్తా
ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసని, రాజధాని అమరావతి భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధానిలో బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారని, ల్యాండ్ పూలింగ్ లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారని, నచ్చిన వారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సమీక్షల తర్వాతే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని అన్నారు. 
amaravathi
YSRCP
jagan
modi
pm

More Telugu News