Andhra Pradesh: చంద్రబాబు దత్తత గ్రామంలో వైసీపీ ఆధిక్యత

  • వైసీపీకి 1,176 ఓట్లు
  • టీడీపీకి 806 ఓట్లు
  • విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొన్నాళ్ల క్రితం స్మార్ట్ విలేజ్ పథకంలో భాగంగా అరకులోయ మండలం పెదలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయాలని చంద్రబాబు సంకల్పించారు. తాజాగా, ఎన్నికల సందర్భంగా పెదలబుడు గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ పోలైన ఓట్లలో అత్యధికంగా వైసీపీ అభ్యర్థికే పడ్డాయి. అరకు నియోజకవర్గంలోని ఈ గ్రామంలో వైసీపీకి 1,176 ఓట్లు పోలవగా, టీడీపీకి 806 ఓట్లు పడ్డాయి. కొన్నాళ్ల కింద మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా, వైసీపీ తరఫున చెట్టి ఫల్గుణ బరిలో దిగారు. అయితే, వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News