Andhra Pradesh: ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించా: వైఎస్ జగన్

  • ఏపీకి‘ప్రత్యేక హోదా’ అవసరం గురించి చెప్పాను
  • విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయి
  • బాబు ఐదేళ్ల పాలనలో అప్పులు రూ.2 లక్షల 57 వేల కోట్లు
ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని మోదీని కోరానని చెప్పారు. ఏపీకి‘ప్రత్యేక హోదా’ అవసరం గురించి, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉంటే, బాబు ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు చేరాయని అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు. 
Andhra Pradesh
YSRCP
jagan
modi
pm

More Telugu News