అత్త కాదు అమ్మే... కొడుకు మరణిస్తే, దగ్గరుండి కోడలికి మరో వివాహం!
- కొడుకు మృతితో ఒంటరైన కోడలు
- సంప్రదాయవాదులు కాదన్నా మరో వివాహం
- ఆదర్శప్రాయంగా నిలిచిన మహిళ
ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాత్తుగా మరణించడంతో, ఇంట్లో హీరాబాయి, ఆమె కోడలు జ్ఞానేశ్వరి మాత్రమే మిగిలారు. తాను పడిన కష్టాలనే తన కోడలు పడరాదని భావించిన హీరాభాయి, కోడలికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, ఆమె సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరిస్తోందని బెదిరింపులకు దిగారు. అయినా బెదరని ఆమె, కోడలికి మరో పెళ్లి చేసేందుకు వరుడిని వెతికింది. తమ గ్రామానికి దగ్గర్లోనే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న యువకుడిని గుర్తించి, అతనికి ఇచ్చి వివాహం జరిపించి, అత్తలందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.