Naresh Goyal: విదేశాలకు వెళుతుంటే బలవంతంగా కిందకు... జెట్ మాజీ చీఫ్ కు ఘోర అవమానం!

  • దుబాయ్ బయలుదేరిన నరేశ్ గోయల్ దంపతులు
  • జెట్ ఎయిర్ వేస్ కు రూ. 15 వేల కోట్ల అప్పులు
  • స్పందించేందుకు నిరాకరించిన సంస్థ
జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు, నెల రోజుల క్రితం సంస్థకు దూరమైన నరేశ్ గోయల్‌ కు ఘోర అవమానం ఎదురైంది. తన భార్య అనితతో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ఆయన ముంబై నుంచి బయలుదేరగా, ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను బలవంతంగా విమానం దించారు. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, గత నెల 17 నుంచి ఒక్క విమాన సర్వీసునూ నడపని సంస్థకు దాదాపు రూ. 15 వేల కోట్ల వరకూ అప్పులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ కి బయలుదేరగా, విమానం కదిలిన తరువాత, ఆయన ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్‌ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి, విమానాన్ని వెనక్కు రప్పించి, గోయల్ దంపతులను కిందకు దించారు. ఈ ఘటనపై స్పందించేందుకు జెట్ ఎయిర్‌ వేస్ నిరాకరించడం గమనార్హం.
Naresh Goyal
Jet Airways
Flight
Dubai
Immigration

More Telugu News