Srikakulam District: శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం.. దగ్ధమైన పెళ్లి బస్సు.. 72 మంది సురక్షితం

  • బైక్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు
  • ద్విచక్ర వాహనదారుడి మృతి
  • క్షణాల్లోనే దగ్ధమైన బస్సు
శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం నుంచి 72 మంది త్రుటిలో తప్పించుకున్నారు. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు జిల్లాలోని సారవకోట మండలం లంబఘాటిలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వాసు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని నరసన్నపేట వాసిగా గుర్తించారు. ప్రమాదం అనంతరం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

దీంతో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులోని 72 మందిని వెంటనే కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందికి దిగిన క్షణాల్లోనే బస్సు బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Srikakulam District
saravakota
marriage bus
Fire Accident

More Telugu News