Narendra Modi: మోదీకి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

  • మోదీ గొప్ప వ్యక్తి 
  • మోదీ ఉండడం భారత్ అదృష్టం
  • భారత ప్రజలకు మంచి నాయకుడున్నాడు
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తిరుగులేని విజయం సాధించిపెట్టిన నరేంద్ర మోదీపై విదేశీ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. మొదట ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పిన ట్రంప్ ఆపై మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, మోదీ ఓ గొప్ప నాయకుడని, మోదీ లాంటి నేత ఉండడం భారతీయుల అదృష్టం అని వ్యాఖ్యానించారు. మోదీ రూపంలో భారత ప్రజలకు సరైన నాయకుడు లభించారని కితాబిచ్చారు.

త్వరలోనే మోదీ, ట్రంప్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జూన్ లో జపాన్ వేదికగా జి20 దేశాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా మోదీకి శుభాభినందనలు తెలియజేశారు. మోదీకి ఫోన్ చేసి ఎన్నికల ఘనవిజయం సాధించిన తీరు పట్ల అభినందించారు.
Narendra Modi
Donald Trump
USA
India

More Telugu News