YSRCP LP: వైఎస్సార్‌ సీపీ శాసన సభా పక్షం భేటీ.. సరిగ్గా 10.31 గంటలకు ప్రారంభం

  • తాడేపల్లిలో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు
  • జగన్‌ను వైసీపీ ఎల్పీ సభ్యుడిగా ఎన్నుకోనున్న సభ్యులు
  • సాయంత్రం గవర్నర్‌కు దీన్ని సమర్పించనున్న నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న తర్వాత ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాయంలో వైసీపీ శాసన సభా పక్షం భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్‌ను తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సరిగ్గా 10.31 గంటలకు సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా జగన్‌ను వైసీపీ ఎల్పీ లీడర్‌గా ఎన్నుకుంటారు. అనంతరం ఈరోజు సాయంత్రం ఈ తీర్మానాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు జగన్‌ అందజేయనున్నారు. కాగా, గెలుపు తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. సమావేశానికి గంట ముందే పలువురు ప్రజాప్రతినిధులు కార్యాలయానికి చేరుకోవడంతో హడావుడి కనిపించింది.
YSRCP LP
Guntur District
tadepalli
first meeting

More Telugu News