ఎక్కడైతే నన్ను అరెస్ట్ చేయించారో అదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎల్లుండి ప్రెస్ మీట్ పెడుతున్నా... బస్తీ మే సవాల్!: వర్మ
- ట్వీట్ చేసిన వర్మ
- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆహ్వానం పలికిన వైనం
- జై జగన్ అంటూ నినాదం
ఎక్కడైతే తనను మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించారో అదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎల్లుండి నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నానని, అడ్డుకునేదెవరో ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు. "విజయవాడలోని అదే పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడుతున్నా... బస్తీ మే సవాల్" అంటూ ట్వీట్ చేశారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఇది తన బహిరంగ ఆహ్వానం అంటూ చివర్లో జై జగన్ నినాదంతో ముగించారు.