Andhra Pradesh: ఏపీ ఎన్నికల ఫలితాలు షాక్ కు గురిచేశాయి: టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుంటాం
  • ప్రజలు మా నుంచి ఇంకా ఏదో ఆశించారు
  • బెజవాడను.. నన్ను విడదీసి చూడలేరు 
నిన్న వెలువడ్డ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు టీడీపీని తీవ్ర నిరాశకు గురిచేసిన విషయం తెలిసిందే. ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. విజయవాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పై 8,183 ఓట్ల ఆధిక్యంతో కేశినేని నాని విజయం సాధించారు.

ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయని అన్నారు. ఓటమికి గల కారణాలపై, ఐదేళ్ల పాలనపై విశ్లేషించుకుంటామని చెప్పారు. ప్రజలు తమ నుంచి ఇంకా ఏదో ఆశించారని అభిప్రాయపడ్డారు. ‘బెజవాడను.. నన్ను విడదీసి చూడలేరు. అందుకే, మళ్లీ గెలిపించారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలని అన్నారు.
Andhra Pradesh
Telugudesam
mp
Kesineni Nani

More Telugu News