Pawan Kalyan: ఏంచేద్దాం..! పార్టీ నాయకులతో సమావేశమైన పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీకి ఈ ఎన్నికలు ఓ పాఠంలాంటివని చెప్పుకోవాలి. సుదీర్ఘకాల లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నా, ఈ ఎన్నికలతో జనసేన భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఓ పార్టీ నిర్వహణ అనేది ఎంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పవన్ కల్యాణ్ జనసేన నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు.

మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల అభ్యర్థులు తమ ఫలితాలపై పవన్ కు వివరించారు. ఎన్నికల సరళిపై తమ అభిప్రాయాలను నివేదించారు. జూన్ నెలలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలుపొందారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో సహా మిగతా అభ్యర్థులందరూ పరాజయం పాలయ్యారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News