Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అలియా భట్

  • టీనేజ్ లోనే వెండితెరకి పరిచయం
  • గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు
  • టాప్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టేసిన క్రేజ్
బాలీవుడ్ తెరపై సందడి చేసే అందమైన భామలలో అలియా భట్ ఒకరు. టీనేజ్ లోనే కథానాయికగా తెరపైకి వచ్చేసిన అలియా, కుర్రకారు హృదయాలను పొలోమంటూ దోచేసింది. అటు గ్లామర్ పరంగాను .. ఇటు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. వరుస అవకాశాలతో పాటు, వరుస విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది.

అలాంటి అలియా టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్'గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ తెరపై టాప్ హీరోయిన్స్ గా తమ హవాను కొనసాగిస్తున్నవారిని సైతం వెనక్కి నెట్టేసి ఆమె ఈ టైటిల్ కొట్టేయడం విశేషం. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి .. కత్రినా కైఫ్ .. దీపికా పదుకొనె .. గాయత్రి భరద్వాజ్ .. అదితీరావు .. జాక్విలిన్ ఫెర్నాండెజ్ .. దిశా పటాని .. అనుకృతి తదితరులు వున్నారు. ప్రస్తుతం అలియా తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' .. హిందీలో 'బ్రహ్మాస్త్ర' .. 'సడక్ 2' సినిమాలు చేస్తోంది. 
alia bhatt

More Telugu News