Amaravati: అమరావతిలో మంత్రుల నేమ్ ప్లేట్స్, చంద్రబాబు ఫోటోల తొలగింపు!

  • సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు
  • ప్రారంభమైన నేమ్ ప్లేట్స్ తొలగింపు పనులు
  • కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త బోర్డులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. నిన్న చంద్రబాబు రాజీనామాతో, టీడీపీ ప్రభుత్వం రద్దు కాగా, సచివాలయంలోని మంత్రుల చాంబర్ల ముందున్న నేమ్ ప్లేట్స్, చాంబర్లలోని చంద్రబాబు ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. దీంతో అధికారులు వాటిని తొలగించే పనులను నేడు ప్రారంభించారు. జీఏడీ ఆదేశాలతో అన్ని గదుల ముందున్న నేమ్ ప్లేట్స్, చంద్రబాబు, ఎన్టీఆర్ ల చిత్ర పటాలను తొలగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నూతనంగా వచ్చే మంత్రుల పేర్లతో నేమ్ ప్లేట్స్ రాయిస్తామని అధికారులు వెల్లడించారు. 
Amaravati
Secreteriate
Chandrababu
Name Plates
Photos
GAD

More Telugu News