Narendra Modi: ప్రధాని మోదీని అభినందించిన అగ్రరాజ్యాధిపతి.. ట్వీట్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • ఇంతటి ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది
  • ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి
  • భారత్‌ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోదీకి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అబినందనలు తెలియజేశారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే భారీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల అధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండగా అమెరికా అధ్యక్షుడు కూడా తన అభినందనలను ట్విట్టర్‌లో ఉంచారు. మీ హయాంలో భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ అభివృద్ధికి మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి అమెరికా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఇరుదేశాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో పరస్పరం సహకరించుకుందామని ఆకాంక్షించారు.
Narendra Modi
america
Donald Trump
wishes to modi

More Telugu News