175 స్థానాలు గెలుస్తానన్న పాల్‌కు వచ్చిన ఓట్లు 281
- 300 ఓట్లు కూడా దక్కించుకోలేకపోయిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు
- డిపాజిట్లు గల్లంతు
- నర్సాపురం లోక్‌సభ స్థానంలో పాల్‌కు 2987 ఓట్లు
నర్సాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పాల్.. అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కూడా పోటీపడ్డారు. అయితే, అక్కడ మాత్రం ఆయనకు 2987 ఓట్లు పోలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన వ్యక్తులు బరిలో నిలిచినప్పటికీ ఎక్కడా డిపాజిట్ కూడా రాకపోవడం గమనార్హం.