KA Paul: 175 స్థానాలు గెలుస్తానన్న పాల్‌కు వచ్చిన ఓట్లు 281

  • 300 ఓట్లు కూడా దక్కించుకోలేకపోయిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు
  • డిపాజిట్లు గల్లంతు
  • నర్సాపురం లోక్‌సభ స్థానంలో పాల్‌కు 2987 ఓట్లు
‘ఇదే ట్రెండ్ కొనసాగితే 175 సీట్లనూ సొంతం చేసుకుంటాం’ అని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్షరాలా.. రెండు వందల ఎనభై ఒకటి(281). సామాజిక మాధ్యమాల్లో చెలరేగి పోయిన పాల్‌ తన క్రేజ్‌తో బోల్డంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాను ట్రెండ్ సెట్టర్‌గా మారడం ఖాయమని, సునామీ సృష్టిస్తామని చెప్పుకొచ్చిన పాల్ నర్సాపురంలో కనీసం 300 ఓట్లను కూడా సొంతం చేసుకోలేకపోయారు. ఇక ఆ పార్టీ అభ్యర్థులకు కూడా ఎక్కడా 300 ఓట్లు దాటలేదు.

నర్సాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పాల్.. అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కూడా పోటీపడ్డారు. అయితే, అక్కడ మాత్రం ఆయనకు 2987 ఓట్లు పోలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన వ్యక్తులు బరిలో నిలిచినప్పటికీ ఎక్కడా డిపాజిట్ కూడా రాకపోవడం గమనార్హం.
KA Paul
Prajashanthi party
Andhra Pradesh
Narsapuram

More Telugu News