Andhra Pradesh: దారుణంగా ఓడిపోయిన ఏపీ మంత్రులు వీరే!
- టీడీపీకి దిగ్భ్రాంతికర ఫలితాలు
- అగ్రనేతలు సైతం ఓటమిపాలు
- నారా లోకేశ్ కు తప్పని ఓటమి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఫ్యాన్' ప్రభంజనం నేపథ్యంలో మంత్రులు సైతం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. నారా లోకేశ్ (మంగళగిరి), కొత్తపల్లి జవహర్ (తిరువూరు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), కిమిడి కళా వెంకట్రావు (ఎచ్చెర్ల), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), శిద్ధా రాఘవరావు (ఒంగోలు లోక్ సభ స్థానం) తమ ప్రత్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
ముఖ్యంగా, తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నారా లోకేశ్ ఓటమిపాలవడం అధికార మార్పు పట్ల ప్రజల్లో ఉన్న బలమైన భావనకు నిదర్శనం అని చెప్పాలి. లోకేశ్ మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేత అంబటి రాంబాబు చేతలో పరాజయం తప్పలేదు.