Vegulla Jogeswara Rao: మండపేట నియోజకవర్గాన్ని వరుసగా మూడోసారి కైవసం చేసుకున్న టీడీపీ

  • టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఘన విజయం
  • వైసీపీ అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ
  • మూడో స్థానానికి పరిమితమైన జనసేన
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు. జోగేశ్వరరావు ప్రస్తుత విజయంతో ఆయన హ్యాట్రిక్ సాధించినట్టైంది. 2009, 2014ల్లో విజయం సాధించిన జోగేశ్వరరావు 2019 ఎన్నికల్లో కూడా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. అయితే కౌంటింగ్ ప్రారంభం నుంచే జోగేశ్వరరావు ఆధిక్యాన్ని కనబరిచారు. ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వేగుల లీలా కృష్ణ మూడో స్థానానికి పరిమితమయ్యారు.  
Vegulla Jogeswara Rao
Pilli Subhash Chandrabose
Leela Krishna
Janasena
Telugudesam Hatrick

More Telugu News