Karnataka: 1,26,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న సుమలత

  • మాండ్య స్థానం నుంచి నిఖిల్ పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత
  • కర్ణాటకలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ
కర్ణాటకలోని మాండ్య స్థానంలో ప్రముఖ నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత తిరుగులేని ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మాండ్య స్థానం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ప్రస్తుతం ఆమె నిఖిల్‌పై 1,26,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్ణాటకలో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. 25 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Karnataka
Sumalatha
Kumara Swamy
Nikhil
Congress
BJP

More Telugu News