Amanchi: చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఓటమి!

  • ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి
  • ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన టీడీపీ
  • బలరాంను గెలిపించుకున్న వైనం
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టీడీపీ అధినాయకత్వంతో విభేదించిన ఆమంచి కృష్ణమోహన్ చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో, ఆయనపై పోటీకి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంను రంగంలోకి దించింది. అంతేగాకుండా, ఆయనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఈ నేపథ్యంలో చీరాలలో గెలిచేది ఎవరంటూ విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల నియోజకవర్గంలో అనూహ్యరీతిలో పరాజయం ఎదురైంది. ఆయనపై కరణం బలరాం విజయం సాధించారు.
Amanchi

More Telugu News