Roja: చంద్రబాబుకు మహిళలే బుద్ధి చెప్పారు: రోజా

  • నన్ను ఐరన్ లెగ్ అన్నారు
  • వాళ్లకు ఈ గెలుపే సమాధానం
  • జగనన్నను సీఎంగా ఆశీర్వదించినవారికి ధన్యవాదాలు
వైసీపీ అగ్రనేత, లేడీ ఫైర్ బ్రాండ్ రోజా చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. దీనిపై రోజా స్పందిస్తూ, తనను ఒకప్పుడు ఐరన్ లెగ్ అంటూ విమర్శించిన వారికి ఈ విజయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళలు తగినవిధంగా బుద్ధి చెప్పారని రోజా పేర్కొన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా పాదాభివందనాలు తెలుపుకుంటున్నట్టు రోజా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు రోజా పేర్కొన్నారు.
Roja
Chandrababu
YSRCP

More Telugu News