Sumalatha: లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో సుమలత గ్రాండ్ విక్టరీ

  • మాండ్యలో సుమలతకు బ్రహ్మరథం
  • ఇండిపెండెంట్ గా పోటీచేసిన సినీ నటి
  • ప్రత్యర్థి నిఖిల్ గౌడకు తప్పని ఓటమి
సినీ నటి సుమలత తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. కర్ణాటకలోని మాండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత తన సమీప ప్రత్యర్థి నిఖిల్ గౌడపై లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. సుమలత విజయం సాధించింది సాక్షాత్తు సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్ పైన కావడం విశేషం అని చెప్పాలి. సుమలత తన భర్త అంబరీష్ మరణించిన తర్వాత కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీచేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్లలో వెనుకంజలో ఉన్నా ఆపైన పుంజుకుని అద్భుత విజయం సొంతం చేసుకున్నారు.
Sumalatha

More Telugu News