Narendra Modi: జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • జగన్ కు అభినందనలు తెలిపిన మోదీ
  • సీఎం కాబోతున్నందుకు శుభాకాంక్షలు
  • ట్వీట్ చేసిన ప్రధాని
ఎక్కడైనా విజేతల గురించే అందరూ మాట్లాడుకుంటారు, వారికి శుభాకాంక్షలు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయరంగంలో ఇది బాగా కనిపిస్తుంది. దేశంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఏపీలో అమోఘమైన రీతిలో విజయం సాధించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ చెప్పారు.

"ప్రియమైన జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీ ఐదేళ్ల పదవీకాలంలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ట్వీట్ చేశారు.
Narendra Modi
Jagan

More Telugu News