Karnataka: బీజేపీ ప్రభంజనానికి తలవంచిన మాజీ ప్రధాని దేవెగౌడ... తుముకూరులో ఓటమి
- బీజేపీ అభ్యర్థి బసవరాజ్ గెలుపు
- జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ
- దేవెగౌడ మనవడు నిఖిల్ సైతం ఓటమిబాటలో పయనం
సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన అపార అనుభవశీలి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అనూహ్యరీతిలో ఓటమిపాలయ్యారు. కర్ణాటకలోని తుముకూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగిన దేవెగౌడను బీజేపీ అభ్యర్థి బసవరాజ్ ఓడించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా సేవలు అందించిన దేవెగౌడ ఓటమి జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.
మరోవైపు, దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ సైతం ఓటమిబాటలో పయనిస్తున్నాడు. మాండ్య నుంచి పోటీచేసిన నిఖిల్ పై సినీ నటి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. భర్త అంబరీష్ మరణంతో మాండ్య నుంచి సుమలత ఇండిపెండెంట్ గా బరిలో దిగారు.