Telugudesam: బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణకు తప్పని ఓటమి

  • జగన్ ప్రభంజనంలో ఏపీ మంత్రులకు కష్టకాలం
  • అప్పలనాయుడు చేతిలో సుజయకృష్ణ పరాజయం
  • ఓటమిబాటలో ఇతర మంత్రులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ముందు మంత్రులు సైతం తలవంచక తప్పడంలేదు. ఇప్పటికే పలువురు మంత్రులు ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉండగా, బొబ్బిలి నుంచి పోటీచేసిన మంత్రి సుజయకృష్ణ రంగారావు ఓటమి ఖరారైంది. ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత అప్పలనాయుడు చేతిలో పరాజయం చవిచూశారు. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైసీపీ 10 స్థానాల్లో గెలిచి, 136 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీడీపీ ఒక్క స్థానంలో గెలిచి 27 స్థానాల్లో ముందంజలో నిలిచింది. జనసేన ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉంది.
Telugudesam
YSRCP
Jagan

More Telugu News