bandi sanjay: టీఆర్ఎస్ కి మరో చేదు అనుభవం .. బీజేపీ వశమైన కరీంనగర్!

  • కరీంనగర్లో చతికిలపడిన టీఆర్ఎస్  
  • బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం
  • ఆలోచనలో పడిన టీఆర్ఎస్ శ్రేణులు 
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వస్తున్నాయి.  ఒక వైపు నుంచి కాంగ్రెస్ .. మరో వైపు నుంచి బీజేపీ కూడా కొన్ని స్థానాలలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ టీఆర్ ఎస్ కు మంచి పోటీ నిస్తున్నాయి. బీజేపీ ముందంజలో వున్న 4 స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించిన ఫలితం తాజాగా ఖరారైపోయింది. కరీంనగర్ లోక్ సభ స్థానం కోసం బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ .. టీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ తలపడ్డారు. చివరి వరకూ సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సుమారు 5000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. కరీంనగర్ వంటి స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లడం టీఆర్ఎస్ శ్రేణులను ఆలోచనలో పడేసింది. 
bandi sanjay

More Telugu News