ramgopalvarma: జగన్‌కు నా శుభాకాంక్షలు... చంద్రబాబుకు నా సానుభూతి: రామ్‌గోపాల్ వర్మ

  • జగన్‌ అఖండ విజయం సాధించబోతున్నారు
  • యాత్ర, ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతి సినిమాను ఆదరించిన స్థాయిలోనే విజయం
  • సర్వే చేసిన లగడపాటిపైనా సెటైర్‌
ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించబోతున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన సానుభూతి తెలియజేస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.

రాజశేఖరరెడ్డి పాదయాత్రపై తీసిన ‘యాత్ర’ సినిమా, ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీసిన ‘ఎన్టీఆర్‌’ సినిమాలకు లభించిన ఫలితాలకు తగ్గట్టుగానే అసెంబ్లీ ఫలితాలు కూడా ఉన్నాయని చమత్కరించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పైనా సెటైర్‌ వేశారు. ఆయనను ఎవరో బలవంతంగా తీసుకువెళ్తున్నట్లు ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ దాని కింద ’ఇంకెప్పుడూ సర్వే చేయను, నన్ను వదిలేయండి’ అని లగడపాటి అన్నట్లు రాశారు.
ramgopalvarma
Jagan
ap victory

More Telugu News