KCR: ఇకపై రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయి: జగన్ విజయంపై కేసీఆర్ స్పందన

  • జగన్ కు అభినందనలు తెలిపిన తెలంగాణ సీఎం
  • మోదీకి కూడా విషెస్ చెప్పిన వైనం
  • మోదీ నాయకత్వంలో దేశం ముందుకు పోవాలంటూ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అఖండ మెజారిటీతో వైసీపీకి ఘనవిజయం కట్టబెట్టడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఏపీలో బ్రహ్మాండమైన విజయం సాధించిన జగన్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఇకపై రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అటు, లోక్ సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
KCR
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News