YSRCP: ఈ సాయంత్రం విజయోత్సాహంతో మీడియా ముందుకు రానున్న జగన్

  • తిరుగులేని ఆధిక్యంలో వైసీపీ
  • ఘోర పరాభవం దిశగా టీడీపీ
  • సంబరాల్లో వైసీపీ శ్రేణులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. మొత్తం 175 స్థానాలకు గాను ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జగన్ పార్టీ 149 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అధికార టీడీపీ 25 స్థానాల్లో ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో, జగన్ సీఎం కావడం ఖాయమని తెలియడంతో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు తెరలేపాయి.

హోరాహోరీ తప్పదనుకున్న ఏపీలో ఏకపక్ష విజయం ముంగిట నిలిచిన జగన్ ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశంలో జగన్ తో పాటు వైసీపీ అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈమేరకు జగన్ బంధువు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెబుతారని వైవీ వివరించారు.
YSRCP
Jagan

More Telugu News