Andhra Pradesh: మంగళగిరిలో లోకేశ్ వెనుకంజ .. 7,400 ఓట్ల లీడింగ్ లో వైసీపీ నేత ఆర్కే!

  • ఏపీలోని 152 స్థానాల్లో వైసీపీ లీడ్
  • ప్రత్తిపాటి పుల్లారావు వెనుకంజ
  • రెండు స్థానాల్లో జనసేన ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందించిన సమాచారం ప్రకారం వైసీపీ 152 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, టీడీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నారా లోకేశ్ వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. మంగళగిరిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై 7400 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ అభ్యర్థి రజనీ 928 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 
Andhra Pradesh
Guntur District
magalagiri
rk
Nara Lokesh
YSRCP
Telugudesam

More Telugu News